Nov 18,2023 19:05

ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌
   యువత అందరికి ఆదర్శంగా నిలవాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా సమాజంలో గొప్పగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలని నవజీవన్‌ బాల భవన్‌ జోనల్‌ కోఆర్డినేటర్‌ బి.నెహేమియా తెలిపారు. శనివారం నవజీవన్‌ బాల భవన్‌ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఏలూరు శనివారపుపేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో బాలలకు 'మాదక ద్రవ్యాల నిర్ములనలో బాలలు, యువత పాత్ర' అనే అంశంపై ఉపన్యాస పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా నెహేమియా మాట్లాడుతూ స్వశక్తితో మంచి ఆలోచనలతో అడుగులు వేస్తూ విజయాలు సొంతం చేసుకొని అటు కుటుంబాన్ని, సమాజ అభివృద్ధికి పాటుపడాలన్నారు. అనంతరం ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను వారు అభినందించారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర వసతి గృహ సుపరిటెండెంట్‌ బివివి.మురళీధర్‌, సిబ్బంది రంగారావు, సత్యన్నారాయణ, శ్రీనివాసులు, బాలలు పాల్గొన్నారు.