రాయచోటి : భారతదేశ విద్యా వ్యవస్థకు పునాదులు వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఆయన 136వ జయంతి సందర్భంగా కలెక్టర్ గిరీష పిఎస్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక ఎస్‌పి కార్యాలయంలో భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం, జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ గిరీష పిఎస్, ఎస్‌పి కష్ణారావు, జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గిరీష మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు, స్వతంత్ర భారతదేశంలో మొదటి విద్యా శాఖ మంత్రి అయినా మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత దేశ విద్యా వ్యవస్థకు పునాదులు వేశారని, యుజిసి, ఐఐటి, ఐఐఎంల స్థాపనలో కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యావ్యవస్థకు పునాదులు వేయడమే కాకుండా దేశంలో మత సామరస్యానికి ప్రత్యేకగా నిలిచారని తెలిపారు. ఆయన చేసిన సేవలకు గాను 1992లో ఆయనకు భారతరత్న పురస్కారంతో సత్కరించారన్నారు. ఎస్‌పి కష్ణారావు మాట్లాడుతూ మతసామరస్యాన్ని, ఉచిత విద్య ప్రాముఖ్యతను దేశానికి చాటిన నాయకుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. జిల్లా ప్రజలందరూ మతసామరస్యంతో మెలగాలని పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాల్‌లో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్‌బాషతో సహా పలువురు ప్రజా ప్రతినిధులు జాతీయ విద్యా దినోత్సవాన్ని, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. డిసిసి అధ్యక్షులు షేక్ అల్లాబకష్ ఆధ్వర్యంలో అబుల్ కలాం ఆజాద్ 135వ జయంతిని పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు చెన్న కష్ణ, ఆర్‌టిఐ అమీర్, జిల్లా సెక్రెటరీ యహియా బాషా మీడియా చైర్మన్ నరేష్, మాజీ పట్టణ అధ్యక్షుడు దర్బార్‌బాషా, మండల అధ్యక్షులు రమణ, నూరుల్లా. ఎండి రఫీ పాల్గొన్నారు. సుండుపల్లి : మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని మండలంలోని ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఎంఇఒ రవీంద్రానాయక్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎస్‌టియు నాయకులు ఆరిఫుల్లా, గణపతి, భీంలానాయక్, మహబూబ్ బాషా, ఇస్మాయిల్, మణికంఠ, కష్ణా నాయక్ పాల్గొన్నారు. పుల్లంపేట : మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతిని నియోజకవర్గ ఇన్‌ఛార్జి గోసాలదేవి, ఎస్‌సిసెల్ కన్వీనర్ శాంతయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోసాలదేవి మాట్లాడుతూ ఆజాద్ స్వతంత్ర సమరయోధుడని, పండిట్ నెహ్రూ మంత్రివర్గంలో విద్యాశాఖను చేపట్టి విద్యారంగంలో నూతన సంస్కరణలను చేపట్టారన్నారు. కార్యక్రమంలో రైల్వేకోడూరు ఎస్‌సిసెల్ కన్వీనర్ బొమ్మనబోయిన నాగరాజు, మహిళా నాయకురాలు లక్ష్మీదేవి, మండల నాయకులు బ్రహ్మయ్యలు పేర్కొన్నారు. కలికిరి: శ్రీనివాస జూనియర్ కళాశాలలో విద్యార్థి నాయకుడు మాలతోటి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆజాద్ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఖాదర్‌బాషా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మదనపల్లె: కాంగ్రెస్ పార్టీ మదనపల్లె నియోజకవర్గ నాయకులు రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంనందు అబుల్ కలాం జయంతి సందఠంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ మన భారతదేశ స్వాతంత్య్ర పోరాట యోధుడన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.