Oct 26,2023 23:29

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటుచేసుకుని దానికి అనుగుణంగా కృషి చేయాలని ల్యాండ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మహ్మద్‌ ఇంతియాజ్‌ అన్నారు. నగరంలోని ఆంధ్రా లయోలా ఇంజనీరింగ్‌ కళాశాలలో గురువారం స్టూడెంట్‌ ఎక్సేంజ్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఇంతియాజ్‌ మాట్లాడుతూ డిగ్రీ చదువు పూర్తవగానే విద్యార్థులు ఎక్కువ మంది విదేశీలలో ఉన్నత విద్యను అభ్యసించడాఇకి ఆసక్తి చూపుతున్నారన్నారు. అయితే కొత్త ప్రదేశాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గురించి విద్యార్థులు ముందుగానే తెలుసుకోవాలని, ఇటువంటి సదస్సులు నిర్వహించడం వలన విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ జోజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలను అందించాలనే ఉద్దేశంతో స్టడీ ఎక్జేంజ్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈసదస్సులో విద్యార్థులకు అన్ని అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కళాశాల సిఎస్‌సి విభాగాధిపతి సి.హెచ్‌.రాజేంద్ర, ఐటి విభాగాధిపతి డాక్టర్‌ కిషోర్‌బాబు, డాక్టర్‌ రామకృష్ణ, విద్యార్ధినీ, విద్యార్థులు పాల్గొన్నారు.