
ప్రజాశక్తి మచిలీపట్నంరూరల్ : కృష్ణా విశ్వ విద్యాలయంలో విద్యార్థులకు మెరుగైన వసతి, భోజనం, భద్రతను కట్టుదిట్టం చేయాలని ఉప కులపతి జి. జ్ఞానమణికి కష్ణాజిల్లా బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు శేకుబోయిన సుబ్రమణ్యం గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్రమణ్యం మాట్లా డుతూ సుదూర ప్రాంతాల నుంచి విశ్వవిద్యా లయానికి వచ్చే విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. శిధిలావస్థకు చేరుకొని ఎప్పుడు కూలిపోతాయో తెలియని హిందూ కాలేజ్ భవనంలో విద్యార్థులు తలదాచు కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి యూనివర్సిటీలో క్యాంటీన్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. నిర్మానుష్య ప్రదేశంలో విశ్వవిద్యాలయం ఉండడం చేత చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టి విద్యార్థులకు భద్రత కల్పించా లన్నారు. కాబట్టి నిర్మాణ దశలో ఉన్న హాస్టల్, క్యాంటీన్, ప్రహరీ గోడలను త్వరగా పూర్తిచేసి విద్యార్థులకు మెరుగైన వసతి, భద్రత,ఆహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కష్ణాజిల్లా బిసి సంక్షేమ సంఘం తరఫున ఉప కులాపతి కి వినతి పత్రం సమర్పించగా ఆయన సానుకూలంగా స్పందించారని సుబ్రమణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలోజోగి శివ, ధనికొండ చిన్ని, నిక్కు రాధాకష్ణ, జన్ను గోవిందు, చేబోయిన కోటేశ్వరరావు, ఎం. పవన్ తదితర బీ.సీ నాయకులు పాల్గొన్నారు.