Nov 19,2023 22:40

ప్రజాశక్తి - బాపట్ల రూరల్
కార్తీక మాసం సందర్భంగా సూర్యలంక తీరంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. కార్తీక మాస పుణ్య స్థానాలు ఆచరించెందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు సముద్రం తీరం వెంబడ పట్టిష్టమైన భద్రతా చర్యలు ఆదివారం తీసుకున్నారు. సముద్రంలో నిర్దిష్ట లోతును సూచిస్తూ ఆ పరిధి దాటి ఎవరు లోపలికి వెళ్లకుండా కర్రలు ఏర్పాటు చేశారు.  అందరికీ కనిపించే విధంగా ఆ కర్రలకు ఎరుపు రంగు జెండాలు కట్టారు. యాత్రికుల రక్షణ కొరకు గజ ఈతగాళ్ళను నియమించారు. భక్తుల వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి అనువైన ప్రదేశాలను సిద్ధం చేశారు. డిఎస్పీ వేంకటేశులు అధ్వర్యంలో రూరల్, మెరైన్ పోలీసులు తీరంలో భద్రత చర్యలు చేపట్టారు. ఆయనతో పాటు మెరైన్ సీఐ సుబ్బారావు, రూరల్ సీఐ జి వేణుగోపాలరెడ్డి, ఎస్‌ఐ కొండారెడ్డి పాల్గొన్నారు.