Nov 16,2023 21:42

'సోమశిల' ఎత్తిపోతలకు గ్రీన్‌సిగల్‌!

 కడప ప్రతినిధి : సోమశిల వెనుకజలాల ఎత్తిపోతలకు గ్రీన్‌సిగల్‌ లభించింది. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం 524 జీవోను విడుదల చేసింది. జిల్లా నీటిపారుదలశాఖ ఇంజినీరింగ్‌ అధికార యంత్రాంగం రూ. 215.25 కోట్లతో కూడిన ప్రతిపాదనలకు రాష్ట్రప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్‌ ఆమోదం తెలిపింది. ఇందులోభాగంగా పెనగలూరు, చిట్వేలి మండలాల పరిధిలోని చెరువులకు సోమశిల వెనుకజలాలను ఎత్తిపోయనున్నారు. ప్రతిఏటా పలకరించే కరువు పరిస్థితులను తట్టుకోవడంలో భాగంగా ఎత్తిపోతల పథకాలను ప్రతిపాదించడం తెలిసిందే. ఇందులో భాగంగానే సోమశిల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. మెటీరియల్‌, స్కీమ్‌ డిజైనింగ్‌, భూసేకరణ వంటి అంశాలను ప్రస్తావిస్తూ నిధులను కేటా యించింది. దీంతో అన్నమయ్య జిల్లాలోని పెనగలూరు మండలానికి సమీపంలోని సోమశిల వెనకజలాలను చుక్క య్యపల్లి మీదుగా సింగమనల చెరువు నుంచి యల్లమరాజుపల్లి చెరువు సహా చిట్వేలి మండలంలోని పలు చెరువులకు నీటిని సరఫరా చేయనున్నారు. టెక్నికల్‌ అనుమతి లభించిన అనంతరం టెం డర్లు పిలవనున్నారు. టెండరు దక్కించుకున్న గుత్తేదారుతో అగ్రి మెంట్‌ చేసుకున్న అనంతరం ఎత్తిపోతల పనులకు శ్రీకారం చుట్ట నున్నట్లు తెలుస్తోంది.