
ప్రజాశక్తి - కంచికచర్ల : గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత క్రమంలో నిధులు ఖర్చు చేస్తున్నట్లు నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. కంచికచర్ల పట్టణంలో మండల పరిషత్ నిధులు, ఇతర నిధులు రూ.65 లక్షల అంచనా వ్యయంతో ఇందిరా కాలనీ - నవభారత్ కాలనీల్లో, పూర్తిచేసిన సిసి రోడ్లను ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు బుధవారం శిలాఫలకాలు ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో కంచికచర్లను అన్ని రకాలుగా అభివద్ధి చేసేందుకు కత నిశ్చయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎంపిపి బషీర్, సర్పంచ్ వేల్పుల సునీత, ఉప సర్పంచ్ వేమా సురేష్ బాబు, జడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి, ఏఈ రవికుమార్, గ్రామ కార్యదర్శి మీర్జావలి, తదితరులు పాల్గొన్నారు.