హిందూపురం : వైద్య సేవలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహకారం అందిస్తున్నారని వైసిపి ఇన్‌ఛార్జి దీపిక వేణురెడ్డి తెలిపారు. గత ఆరు నెలల క్రితం చిలమత్తూరు మండలం కొత్త సాములపల్లికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర దెబ్బలు తగిలాయి. ఈయన వైద్య చికిత్సల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందిన రూ.4లక్షలను శనివారం అందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు వేణురెడ్డి, చిలమత్తూరు ఎంపిపి పురుషోత్తమ రెడ్డి, మండల కన్వీనర్ సానే ప్రభాకర్ రెడ్డి, ఎంపీటీసీ రాఘవేంద్ర రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు హనుమంత రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు నయీముల్లా, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్ పంపిణీ
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద సిరి నరసింహా గ్యాస్ కనెక్షన్ ప్రశాంత్ గౌడ్, ప్రణీత్ గౌడ్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్‌ను వైసిపి ఇన్‌ఛార్జి దీపిక చేతుల మీదుగా శనివారం అందించారు. ఈ సందర్బంగా దీపిక మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తోందన్నారు. ఈ పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి గ్యాస్ స్టవ్, సిలిండర్, గ్యాస్ పైప్, రెగ్యులేటర్లను ఉచితంగా అందిస్తోందన్నారు. ఒక సిలిండర్‌కు రూ.300 సబ్సిడీని కూడా ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ జబివుల్లా, ఎజెన్సీ నిర్వహకులు, న్యాయవాది వెంకటరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు