
పోలవరం: మండల కేంద్రంలో వారపు సంత సందర్భంగా కోట రామచంద్రపురం ఐటిడిఎ వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకం వ్యవసాయ శాఖ సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి శివ నాగమణి, సుబ్బలక్ష్మి, పోసమ్మ, ప్రశాంతి, రామలక్ష్మి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.