ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : మండల పరిధిలోని తిమ్మసముద్రం గ్రామంలో వరి రైతులకు ప్లాంట్‌క్లినిక్ పై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల ఏరువాక కేంద్రం శాస్రవేత్త, డాట్ కోఆర్డినేటర్ ఓబయ్య, జి.సురేఖ వాణి మాట్లాడుతూ ఖరీఫ్‌లో సాగుచేసిన వరికి బెట్ట పరిస్థితుల్లో ఉల్లికోడు ,అగ్గి తెగులు ఆశించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తెగుళ్లు నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అగ్గి తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు, లేదా నేటివో 0.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ కమతం యాకోబు, విలేజ్ అసిస్టెంట్ దివ్య ,రైతులు పాల్గొన్నారు.