
ప్రజాశక్తి-విజయవాడ: పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం విజయవాడ రైల్వే ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. రైల్వే ఎస్పీ కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి రైల్వే డిఎస్‌పి పి.నాగరాజు రెడ్డి అతిథిగా హాజరయ్యారు. ఈ ఓపెన్ హౌస్‌లో విజయవాడ కానూరులోని వెలగపూడి దుర్గాంబ సిద్ధార్థ లా కళాశాల ప్రొఫెసర్లు సిహెచ్ శ్రీనివాసరావు, అనురాధ, పుష్ప, కిరణ్, 200 మంది లా విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఆర్‌ఐ సురేష్, ఇతర సిబ్బంది పోలీస్ ఆయుధాలపై అవగాహన కల్పించారు. 303, ఎల్‌ఎంజి, ఎస్‌ఎల్‌ఆర్, ఏకే 47, కార్బన్, రివాల్వర్, పిస్టల్, స్టోన్ గార్డ్‌ల ఉపయోగం, అవి పనిచేసే, ఉపయోగించే విధానాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఎస్‌బి ఇన్‌స్పెక్టర్ యు.బంగారు రాజు, విజయవాడ జిఆర్‌పి పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఒ పి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.