
ప్రజాశక్తి - మైలవరం : స్థానిక లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు కె వెంకయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 17, అండర్ 14 ఉమ్మడి కష్ణా జిల్లా బాల బాలికల పెన్సింగ్ పోటీలు విజయవాడలో జరిగాయని ఈ పోటీల్లో తమ పాఠశాల చెందిన అండర్ 17 విభాగంలో పి.సిద్దు (ఇప్పి), ఎస్కె.మహమ్మద్ ఆరిఫ్ (పో ఇల్) కె.ఇబ్రహీం ఖలీల్ (శా బార్) ఎన్.దీప్తి ( శా బార్) కే అరుణ ( ఇప్పి) అండర్ 14 విభాగంలో జై రత్న, వీఐపీ ద్రావిడ్, బి ఉమాదేవి, సిహెచ్ వెంకటలక్ష్మిలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈనెల 15వ తేదీన నంద్యాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో వీరు పాల్గొంటారు అన్నారు. పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుని కే కనకదుర్గ, ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు.