Nov 03,2023 22:35

ఎంపికైన విద్యార్థులు

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో జరిగిన ఉమ్మడి కృష్ణాజిల్లా యస్‌జిఎస్‌ సెలక్షన్స్‌లో యస్‌.ఆర్‌.ఆర్‌. చెస్‌ కోచింగ్‌ అకాడ మి విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని కోచింగ్‌ అకాడమి డైరెక్టర్‌ పి.రేణుక, ప్రెసిడెంట్‌ జె.సౌజన్య తెలిపారు. నగరంలోని చెస్‌ అకాడమిలో శుక్రవారం రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ చైతన్య కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న కె.సందీప్‌ నాలుగు రౌండ్లులో నాలుగు పాయింట్లు సాధించి ద్వితీయ స్థానం సాధించాడన్నారను. ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో తొమ్మిదవ తరగతి చదువుతున్న యం.జితేష్‌ నాలుగురౌండ్లలో మూడు పాయింట్లు సాధించి తృతీయ స్థానం సాధించినట్లు తెలిపారు. మారుతీనగర్‌లోని రవీంధ్ర భారతి స్కూల్‌ తొమ్మిదవ తరగతి విద్యార్థి యం.వెంకట రాహుల్‌ నాలగు రౌండ్లలో మూడు సాయింట్లు సాధించి ఆరవ స్థానం సాధించాడన్నారు. యస్‌.ఆర్‌. ఆర్‌ చెస్‌ కోచింగ్‌ అకాడమిలో నిపుణులైన కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ ఇవ్వడం వల్లనే మంచి ప్రతిభ కనపరచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనపరచి పతకాలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అకాడమి కోచ్‌, ఇంటర్నేషనల్‌ ఆర్బిటర్‌ ఎస్‌ఎమ్‌.ఫణికుమార్‌ పాల్గొని విజేతలను అభినందించారు.