
పుడమికి ముప్పని తెలిసినా
మనుగడ ప్రశ్నార్థకమవుతున్నా
మరువనంటోంది మానవలోకం
విడువనంటోంది ప్లాస్టిక్ భూతం
సంద్రాలను కప్పేస్తున్నా
మూగ ప్రాణాలు బలవుతున్నా
ప్లాస్టిక్‌పై మమకారం చావదెందుకో
ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించమెందుకో
చేయి.. చేయి.. కలిపేద్దాం
క్లాత్ బ్యాగులు వాడేద్దాం
ప్లాస్టిక్ నిర్మూలన చేపడదాం
ప్రకృతి సమతుల్యత కాపాడుదాం
కె. సాయి దేవ కార్తికేయ
4వ తరగతి
గాయత్రి టెక్నో స్కూల్
విజయనగరం, 8985693899