
తొమ్మిది నెలలు చీకటిని ఛేదించి
మన జీవితానికి వెలుగు ప్రసాదిస్తుంది అమ్మ..
ఇరవై ఏళ్లు విద్యాబుద్ధులు నేర్పించి
విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు నాన్న..
కనులు తెరిచే వరకు కడుపులో పెట్టుకుని కాపాడుతుంది అమ్మ...
కాళ్ల మీద నిలబడే వరకు కనురెప్పలా కాపాడతాడు నాన్న...
రక్తాన్ని పాలుగా మార్చి పోషిస్తుంది అమ్మ..
ఎంతటి కష్టానైనా ఆనందంగా భరిస్తూ
బిడ్డకి సంతోషాన్ని పంచుతాడు నాన్న...
తాను ఆకలితో ఉన్నా తన బిడ్డల కడుపు నింపుతుంది అమ్మ
ఎంత కష్టపడైనా పిల్లల భవిష్యత్తుని అందంగా మలచాలనుకుంటాడు నాన్న
ఏ స్వార్థం లేని ప్రేమని మనకు పంచుతుంది అమ్మ
మన నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా
మన అవసరాలు తీరుస్తాడు నాన్న..
అలాంటి మన అమ్మానాన్నలకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?
జీవితాంతం వారికి ప్రేమని పంచడం ద్వారా తప్ప..!
తమ్మిన ప్రశాంతి
9వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రఘుమండ, విజయనగరం .