Nov 21,2023 23:17

ప్రజాశక్తి-గండేపల్లి
ప్రజాసంక్షేమమే వైసిపి ప్రభుత్వ ధ్యేయమని జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కు జగనే ఎందుకు కావాలి కార్యక్రమం మురారి సచివాలయం నందు వైఎసిపి యువ నాయకులు ఉప సర్పంచ్‌ జాస్తి వసంత్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సిఎం జగన్‌ను మళ్లీ ఎందుకు ఎన్నుకోవాలో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. అంతేకాకుండా సమస్యలు లేకుండా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమానికి ముందుగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి,పార్టీ జెండాను ఎగరవేసారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ చలగళ్ళ దొరబాబు, వైస్‌ ఎంపీపీ కుంచే రాజా,కందుల చిట్టిబాబు, గ్రామ సర్పంచ్‌ కుక్కల ఆనందబాబు,ఎంపీడీవో వెంకటరామన్‌, తహాసిల్దార్‌ సత్యనారాయణ,ఈఓఆర్‌ డి మూర్తి, కార్యదర్శి పోతుల శిరీష, వైఎస్‌ఆర్సిపి నాయకులు, కార్య కర్తలు,అభిమానులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్‌ జగన్‌ పాలన లో సంక్షేమం, అభివృద్ధి చెందుతుందని స్థానిక ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు అన్నారు. మంగళవారం మండలంలోని జె.కొత్తూరు లో సుమారు రూ.40 లక్షల నిధులతో నిర్మించిన వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌, రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం వై ఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఆయన అన్నారు. ప్రజలందరికీ నవరత్న పథకాలను సిఎం జగ అమలు చేస్తున్నారన్నారు. తొలుత గ్రామ సచివాలయం వద్ద అభివద్ధి పథకాల బోర్డ్‌ ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్‌ నకిరెడ్డి నాగేశ్వరరావు, జగ్గంపేట ఉప సర్పంచ్‌ బండారు రాజా, వైసిపి నాయకులు పాల్గొన్నారు.