Nov 09,2023 23:09

ప్రజాశక్తి-చందర్లపాడు: ఈ నెల 15వ తేదీన విజయవాడలో జరిగే సిపిఎం ప్రజా రక్షణభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని చందర్లపాడు మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఎన్టీఆర్‌ జిల్లా కమిటీ సభ్యులు చనుమోలు సైదులు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో వైసీపీ, టిడిపి, జనసేన పార్టీలు పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. అసమానతలు లేని రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సిపిఎం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో షేక్‌ హస్సాన్‌, వేల్పుల ఏసోబు, చిన్నశ్రీనివాసరావు, ఎస్‌కె ఉద్దండుసాహెబ్‌, కనగాల సీతారావమ్మ తదితరులు పాల్గొన్నారు. జగ్గయ్యపేట: రాష్ట్ర సమగ్రాభివద్ధి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15న ప్రజా రక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం సీనియర్‌ నాయకులు కాకనబోయిన లింగారావు కోరారు. గురువారం మండలంలోని చిల్లకల్లు, గౌరవరం, పోచంపల్లి, గుండబోయినపాలెం, బండిపాలెం, వేదాద్రి, జయంతిపురం, ధర్మవర ప్పాడు తండా గ్రామాలలో బైక్‌ జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా లింగారావు మాట్లాడుతూ బహిరంగ సభకు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాంప్రసాద్‌, రావెళ్ల శేషు, దంతాల నరేంద్ర, జుజ్జువరపు వెంకటరావు, కోట రవికుమార్‌, బాలు, దాశరధి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. తిరువూరు: తిరువూరు జంట సినిమా హాళ్ల సెంటర్‌లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎం.నాగేంద్ర ప్రసాద్‌, సీనియర్‌ నాయకులు ఎస్‌వి భద్రం, బలగాని వెంకటేశ్వరరావు, పంతంగి శ్రీనివాసరావు, ఆకుల రవి, చప్పిడి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. నందిగామ: నందిగామ ఆరో వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె.గోపాల్‌, సయ్యద్‌ ఖాసిం, గోపీనాయక్‌, కర్రీ వెంకటేశ్వరరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 9, 10, 11 వార్డుల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ప్రజా రక్షణభేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని, ప్రత్యక్షంగా సభ లో పాల్గొని మద్దతు తెలియజేయాలని కోరారు. ఊటుకూరు గ్రామంలో గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం టౌన్‌ కమిటీ కార్యదర్శి యం మహేష్‌, కమిటీ సభ్యులు ఎ విఠల్‌ రావు, చింతల శివ, నాయకులు షేక్‌ బాషా, బొమ్మసాని సురేష్‌, కె నాగేశ్వరరావు పాల్గొన్నారు. విజయవాడ: ప్రజారక్షణ భేరీ బహిరంగ సభ జయప్రదం చేయాలని కోరుతూ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మహిళలతో రెడ్‌ శారీస్‌ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.శ్రీదేవి మాట్లాడుతూ సభకు పెద్దఎత్తున ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె.సరోజ, జి ఝాన్సీ, సుప్రజా, ఆషా, షకీలా, దేవీకుమారి, పిచ్చమ్మ, రత్నకుమారి, సిహెచ్‌.అరుణ, బి.అమ్ములు పాల్గొన్నారు.