Oct 29,2023 22:44

నూతనంగా ఎన్నికైన సభ్యులు

ప్రజాశక్తి - జగ్గయ్యపేట : పట్టణంలోని టీచర్స్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ కార్యాలయంలో యుటిఎఫ్‌ జగ్గయ్యపేట మండల శాఖ అధ్యక్షులు జి.ప్రవీణ్‌ కుమార్‌ అధ్యక్షతన మండల వార్షిక కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల శాఖకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మండల శాఖ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా జి.పల్లవి, జి.ముక్తేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల అధికారిగా జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసరావు, ఎన్నికల పరిశీలకులుగా జిల్లా ఉపాధ్యక్షులు ఎం.కష్ణయ్య వ్యవహరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్‌, జిపిఎస్‌ విధానాలను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, పిఎఫ్‌, పార్ట్‌ పేమెంట్లకు, ఎపిజిఎల్‌ఐ ఫైనల్‌ క్లైమ్‌ల కొరకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గౌరవాధ్యక్షులుగా జి.ప్రవీణ్‌ కుమార్‌, సహాధ్యక్షులుగా వి.వి.సుబ్బారావు, సహాధ్యక్షురాలుగా బి.భాగ్యలక్ష్మి, కోశాధికారిగా టి.ప్రసాద్‌ బాబు, కార్యదర్శులుగా రాజశేఖర్‌, మునీర్‌ బాషా, దేవదానం, సాయి శ్రీనివాసరావు, ఆంధ్రయ్య, పరమేశ్వరరావు, రత్న ప్రసాద్‌, కె.వి.బి.చారి, దుర్గాప్రసాద్‌, సుజాత, విజయలక్ష్మి, జిల్లా కౌన్సిలర్లుగా నరసింహారావు, సత్యనారాయణ, హనుమంతరావు, సుధానంద్‌, వి.సిహెచ్‌. వెంకటేశ్వర్లు, మూర్తి ,గంగాధరరావు, జయసుధ, నిర్మల లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ఈ సంవత్సరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ఎం.రమణ, పి.వి.నాగేశ్వరరావు, జి.వి.టి.రాజశేఖర్‌, ఎన్‌.ఆర్‌.పి ఎస్‌.రెడ్డి, జి.చంద్రశేఖర్‌, టి.ప్రసాద్‌ బాబులను జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం నవంబర్‌ 5వ తేదీన ఇబ్రహీంపట్నంలో జరిగే యుటిఎఫ్‌ ఎన్టీఆర్‌ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరుచూ ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు.