Nov 09,2023 23:12

ప్రజాశక్తి-చల్లపల్లి : టిడిపి ప్రభుత్వ హయాంలో పాముకాటు బాధితులకు అందించే చికిత్స మెరుగు పరచకుండా యజ్ఞాలు యాగాలు చేశారని, వైఎస్‌ఆర్సిపి ప్రభుత్వం పాముకాటు బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు అన్నారు. చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మోపిదేవి మండలం వెంకటాపురం కాలనీకి చెందిన పాము కాటు బాధిత బాలిక కొండపల్లి విహారికను గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సౌకర్యాలు, వైద్య చికిత్స విధానం పూర్తి స్థాయిలో ఆధునికరించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. లక్ష్మీపురం సర్పంచ్‌ కొల్లూరి కోటేశ్వరరావు, వెంకటాపురం గ్రామ ప్రముఖులు, వైసీపీ నాయకులు తుమ్మా రవి పాల్గొన్నారు.