Nov 08,2023 22:58

ప్రజాశక్తి-హనుమాన్‌జంక్షన్‌ : పాడి రైతు కుటుంబాల ఆర్థికాభివద్ధే కష్ణామిల్క్‌ యూనియన్‌ ధ్యేయమని చైర్మన్‌ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. హనుమాన్‌ జంక్షన్‌ క్లస్టర్‌ పరిధిలోని వెంకటాద్రి పురం, జంగంగూడెం పాలసొసైటీలను బుధవారం ఆయన సందర్శించారు. పాడిరైతుల సంక్షేమమే మన మతం- అలుపెరుగని సేవ మన అభిమతం అనే కార్యక్రమంలో భాగంగా పాలసేకరణ, వెన్న శాతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంఘ అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, రైతులతో సమావేశం నిర్వహించారు. పాల ఉత్పత్తి, వెన్నశాతం అభివద్ధికి చేపట్టాల్సిన అంశాలపై రైతులకు వివరించి నిర్వహణలో ప్రతి రైతు యాజమాన్య పద్ధతులు పాటించాలని అన్నారు.అనంతరం సొసైటీ అధ్యక్షులు శనగలు వెంకటశివజ్యోతి, డివి.సుబ్బారావు ఆధ్వర్యంలో 203 మంది పాడిరైతులకు రూ.796,525 బోనస్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ కిలారు కిరణ్కుమార్‌, సూపర్వైజర్లు ఎస్‌ ప్రసాద్‌, పి.వీరాంజనేయులు,సొసైటీ సభ్యులు, పాడిరైతులు పాల్గొన్నారు.