ఓటరు క్లైయిమ్స్ను త్వరితగతిన పరిష్కరించండి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఓటర్ల జాబితాకు సంబంధించి పెండింగ్లో ఉన్న క్లైయిమ్స్ను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఓటరు జాబితాలో పెండింగ్ క్లైయిమ్స్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో నగరి ఆర్డీవో కార్యాలయం నగరి, నిండ్ర, ఎస్ఆర్పురం, వెదురుకుప్పం కార్వేటినగరం, పెనుమూరు తహసీల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితాకి సంబంధించి అందిన ఫారం 6,7,8 క్లైయిమ్స్ను నిర్ణీత గడువు లోపల నియమనిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. ఈనెల 23వతేదీ లోపు పెండెన్సీని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఫారం-6,7,8 క్లైయిమ్స్ను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పూర్తిగా బిఎల్ఓలు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చిన ఫార్మ్స్ను ఎప్పటికప్పుడు డిస్పోస్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్, ఫోటోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్కి సంబంధించి చెక్లిస్ట్ జనరేట్ చేయాలన్నారు. ఆకస్మిక తనిఖీలో నగిరి ఆర్డీవో సుజన, సంబంధింత మండలాల తహసీల్దార్ లు,సిబ్బంది పాల్గొన్నారు.