రాయచోటి : జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితా స్వచ్చీకరణకు కషి చేస్తున్నట్లు కలెక్టర్ గిరీష పిఎస్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు.గురువారం విజయవాడలోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ నాటికి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ఓటర్ల జనాభా నిష్పత్తి, లింగ నిష్పత్తి, ఓటర్ల నమోదు, అనామలిస్ ఓటర్ల పెండింగ్, ముసాయిదా జాబితాలో ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఎపిక్ కార్డుల ప్రింటింగ్, పంపిణీ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గిరీష పి.ఎస్, జెసి ఫర్మన్ అహ్మద్ ఖాన్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుతూ ముసా యిదా ఓటర్ల జాబితా ప్రచురణ నాటికి ఫారం-6 పెండింగ్ 25 శాతం, ఫారం-7 పెండింగ్ 15 శాతం, ఫారం-8 పెండింగ్ 10 శాతం ఉందన్నారు. పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు నియోజకవర్గ ఎలక్ట్రోల్ అధికారులు, తహశీల్దారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ముసా యిదా ఓటర్ల జాబితా పై అభ్యర్థనలు, తొలగింపులు, కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరిస్తున్నామని చెప్పారు. రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలతో తరచుగా సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభ్యర్థనలు అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ముఖ్యంగా 18, 19 సంవత్సరాల యువ ఓటర్ల నమోదుపై దష్టి పెట్టినట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌డిఒ రంగస్వామి, కలెక్టరేట్ ఎస్‌డిసి శ్రీలేఖ, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.