Nov 06,2023 23:15

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : ఢిల్లీ రైతు పోరాటాలను కవర్‌ చేసిన న్యూస్‌ క్లిక్‌ పత్రిక సంపాదకులు ప్రబీర్‌ పురస్కయాపై ఢిల్లీ పోలీసులు పెట్టిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంచకర్ల రంగారావు ఆధ్వర్యంలో అంగలూరు గ్రామ కౌలు రైతు సంఘం కమిటీ ఆధ్వర్యంలో స్థానిక వెలగ చెట్టు సెంటర్‌ లో సోమవారం దహనం చేశారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ దేశవ్యాప్తగా ప్రజా ఉద్యమాలను రైతు ఉద్యమాలను నేర పూరితంగా అభివర్ణిస్తూ, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు బి.వి. శ్రీనివాసరావు, కౌలు రైతు సంఘం మండల గౌరవా ద్యక్షులు మామిడి బాబూరావు, గ్రామ కార్యదర్శి చిలుముల కష్ణ, కమిటీ సభ్యులు ,నాయకులు మామిడి నాగబాబు, మామిడి ఏడుకొండలు, పంగా సందీప్‌,చిలుముల రాములు, చిలుముల లక్షణుడు, చిలుముల రామారావు, నత్తా వెంకటేశ్వరరావు, మామిడి గోపాలకష్ణ తదితరులు పాల్గొన్నారు