
పి.సాయి బాబా
ప్రజాశక్తి- నందిగామ : నందిగామ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్‌గా పి.సాయి బాబా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఆర్డీవో రవీంద్ర రావు గుంటూరు బదిలీ అయ్యారు. నూతన ఆర్డీవోను నందిగామ తహశీల్దారు నరసింహారావు, వీరులపాడు తహశీల్దారు నాయిక్‌లు, ఆఫీసు సిబ్బంది సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలో రెవెన్యూ సమస్యలను తక్షణమే పరిష్కరించడం జరుగుతుం దన్నారు. నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలో కాలుష్యం వెద జల్లే ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎపి సిఆర్‌డిఎ నుండి బదిలీపై నందిగామ ఆర్‌డిఒగా వచ్చినట్లు తెలిపారు.