ప్రజాశక్తి - ఆగిరిపల్లి
ఎంఎల్‌ఎగా తనకున్న అనుభవంతో నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడు కృషి చేస్తానని నూజివీడు నియోజకవర్గ మాజీ ఎంఎల్‌ఎ చిన్నం రామకోటయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కనసానపల్లి గ్రామంలో మిత్రులు, శ్రేయాభిలాషులతో ఆయన ఆత్మీయసమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నియోజకవర్గ ఎంఎల్‌ఎగా బరిలో దిగతానని, నియోజకవర్గ పరిధిలో గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పాటుపడతానన్నారు. మండల ప్రజలు తన గెలుపుకు సహకరించాల్సిందిగా కోరారు.