
కనిపించే దేవత అమ్మ
దేవుడిచ్చిన వరం అమ్మ
నా తొలి మిత్రురాలమ్మ
తీర్చలేని రుణం అమ్మ
అంతులేని ప్రేమ చూపేది అమ్మ
మొదటి పలికిన పలుకు అమ్మ
మొదటి చూసిన చూపు అమ్మ
కష్టంలో తోడు అమ్మ
వెన్నంటి నడిపేది అమ్మ
అమ్మ లేనిదే నేను లేను
అమ్మలేనిదే ఈ లోకం లేదు
వి. ఆశ్రిత శ్రీవర్ష
7 వ తరగతి, లిల్లీ
అరవిందామోడల్ స్కూల్
మంగళగిరి, గుంటూరు జిల్లా.