Nov 13,2023 16:44

ఒకరోజు రేణుక అనే ఒక అమ్మాయి తన అన్నతో కలిసి బయటకు ఆడుకోవడానికి వచ్చింది. అక్కడ తనకు ఒక అందమైన కుక్కపిల్లను చూసింది. తనకు చాలా సంతోషంగా అనిపించింది. కుక్క పిల్లను తీసుకుని తన ఇంటికి వెళ్ళింది. 'అమ్మా నాకు ఏమి దొరికిందో చూడు!' అని అమ్మకు కుక్కపిల్లని చూపించింది.
'రేణుకా నీకు నేను కనపడకపోతే భయం వేస్తుంది కదా?' అంది వాళ్లమ్మ. అప్పుడు రేణుక 'అవును అమ్మా నాకు చాలా భయం వేస్తుంది.' 'నీకులాగే ఈ కుక్క పిల్లకు కూడా భయం వేస్తుంది కదా! తన తల్లి కూడా చాలా బాధపడుతుంది. ఇప్పుడు మనం ఈ కుక్కపిల్లను తన తల్లి వద్దకు చేర్చి వద్దాం!' అంది రేణుక వాళ్లమ్మ.
'సరే' అంటూ రేణుక కుక్కపిల్లని తీసుకుని, అమ్మతో కలిసి అది దొరికన చోటికి వెళ్లింది.
అక్కడికి వెళ్ళ చూడగానే ఒక కుక్క కనిపించింది. ఆ కుక్కని చూడగానే కుక్కపిల్ల రేణుక చేతుల్లో నుంచి దూకేసి, వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్ళింది.


- ఎం సౌజన్య
8వ తరగతి, యంపియుపి స్కూల్‌, కె పాలవలస