Nov 02,2023 22:31

ప్రజాశక్తి-భవానీపురం
పన్నులు వసూళ్లపై ఉన్న శ్రద్ధ పాలనపై లేకపోవటం దురదష్టకరమని సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు పంచదార్ల దుర్గాంబ అన్నారు. 45వ డివిజన్‌ జోజీనగర్‌లో గత మూడు రోజులుగా మంచినీళ్లు రాక ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో గురువారం స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దుర్గాంబ మాట్లాడుతూ సమస్యను అధికారులకు తెలియజేసినప్పటికీ కంటి తుడుపు చర్యగా ఒక రోజు ట్యాంకర్‌తో నీరు పంపించారని తెలిపారు. అవి చాలక ప్రజలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నా కనీసం స్థానిక కార్పొరేటర్‌ పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. ప్రజా సమస్యలను విస్మరించడం దారుణం అన్నారు. వెంటనే మంచినీరు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు, ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్‌ నగర అధ్యక్షులు కంచర్ల భార్గవ్‌, అంజూరి సూరిబాబు, కొత్తపల్లి పిచ్చయ్య, ఆర్‌.సుబ్బారెడ్డి, రత్తమ్మ పాల్గొన్నారు.