Oct 29,2023 22:48

జొన్నలగడ్డ చెక్‌ పోస్ట్‌ వద్ద మద్యం తనిఖీ చేస్తున్న ఎసిపి జనార్ధన్‌ నాయుడు

ప్రజాశక్తి - నందిగామ : నందిగామలో తెలంగాణ మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుం టామని నందిగామ ఎసిపి జనార్థన్‌ నాయుడు హెచ్చ రించారు. నంది గామ మండలం జొన్నలగడ్డ చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి నుంచి 20 మద్యం బాటిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. మాగల్లు గ్రామంలో యథేచ్చగా మద్యం అమ్మకాలు సాగిస్తున్న వారిపై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా కొందరి దగ్గర నుంచి మద్యం బాటిల్స్‌ స్వాధీనం చేసుకొని వారిని స్టేషన్కు తరలించారు.