
ప్రజాశక్తి-సబ్బవరం : సకల సమస్యలకు మూల కారణం మానసిక సమస్య అని సైకాలజిస్ట్ సాయిలక్ష్మి అన్నారు. అనకాపల్లి మానసిక వైద్య ఆరోగ్యశాఖ, ఎన్‌ఎస్‌ఎస్ సంయుక్తంగా 'మేమున్నాం ఏ సమస్యకైనా పరిస్కారం ఉంది' అనే అంశంపై స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సైకాలజిస్ట్ సాయిలక్ష్మి మాట్లాడుతూ నేటి విద్యార్థుల మానసిక రుగ్మతలకు గల కారణాలు, సమస్యలను పరిష్కరించే మార్గాలను తెలిపారు. ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి మాట్లాడుతూ సామాజిక, ఇతర మాధ్యమాల ద్వారా ఒత్తిడి పెరగడంతో నేటి యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. సోషల్ వర్కర్ మధులత మాట్లాడుతూ కుటుంబ సంబంధాలు, స్నేహితులు, బంధువుల మధ్య సామాజిక సంబంధాలు మానసిక ఆరోగ్యాన్ని పెంచుతాయని చెప్పారు. ఎన్‌ఎస్‌ఎస్ పిఓ డాక్టర్ గణేష్, బోటని అధ్యాపకులు నివేదిత, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.