Nov 17,2023 23:42

కవులకు సన్మానం

కవులకు సన్మానం
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్థానిక ప్రధాన గ్రంథాలయ శాఖ కార్యా లయంలో శుక్రవారం కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ప్రముఖ కవులు బమ్మెర పోతన, ఆదికవి నన్నయ్యభట్టు, గురజాడ అప్పా రావు, జంధ్యాల పాపయ్య వంటి కవుల గురించి వివరించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ చాటిన కవులను ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాలు అందించారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కవి సమ్మేళనం లో పాల్గొన్న కవులను తన చేతుల మీదుగా సత్కరించడం ఆనందంగా ఉందని ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ అంజూరు శ్రీనివాసులు అన్నారు. కవులు గురు నాథం, ఆనందయ్య మునిసుబ్బారెడ్డి, గ్రంథాలయ అధికారి ఎన్‌ఎస్‌ లావణ్య, తొట్టంబేడు గ్రంథాలయ అధికారి ఎ హరికృష్ణ, రిటైర్డ్‌ గ్రంథాలయ అధికారి బి చెంచురెడ్డి పాల్గొన్నారు.