Nov 02,2023 23:03

ప్రజాశక్తి కలక్టరేట్‌ (కృష్ణా) : ఎక్సైజ్‌ కుంభకోణం కేసులో కొల్లు రవీంద్రపై పెట్టిన అక్రమ కేసును తీవ్రంగా ఖండిస్తున్నట్లు మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ నాయకులు తెలిపారు. స్థానిక నియోజక వర్గ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ కుట్రలో భాగంగానే కొల్లు రవీంద్రపై మద్యం కేసు బన ఇస్తున్నారని మండి పడ్డారు. తమ నాయకుడి జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కులం చుడం, మతం చూడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. బీసీలకు చెందిన 75వేల కోట్లు దారిమల్లించిన దగా కోరు జగన్‌ రెడ్డి అన్నారు. కొల్లు రవీంద్రను ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బీసీల రిజర్వేషన్‌ రద్దుతో 16,800పదవుల జగన్‌ దూరం చేశారన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీలను ముందుకు నడిపింది చంద్రబాబే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ,రూరల్‌ అద్యక్షులు ఇలియాస్‌ పాషా, కుంచె నాని, కార్పొరేటర్లు దేవరపల్లి అనిత,సమతా కీర్తి, గొర్రెపాటి గోపి చంద్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎం వి. బాబా ప్రసాద్‌ , మాజీ జెడ్‌ పి టి సి లంకే నారాయణ ప్రసాద్‌ పాల్గొన్నారు