కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో విజయవంతంగా మోకాలు, భుజం ఆర్థ్రోస్కోపీ సిఎంఇ

ప్రజాశక్తి - హెల్త్ యూనివర్సిటీ : మోకాలు, భుజం సంబంధించి కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్థ్రోస్కోపీ సీఎంఈ విజయవంతంగా జరిగింది. నగరంలోని నోవోటెల్ హోటల్లో ఆదివారం జరిగిన ఈ కార్యశాలలో అధునాతన ఆవిష్కరణలపై విస్తతంగా చర్చించారు. విజయవాడ ఆర్థోపెడిక్ సొసైటీ (వీవోఎస్), ఆర్థోపెడిక్ సర్జన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (వోఎస్‌ఎస్‌ఏపీ)ల సహకారంతో ఈ వర్క్ షాప్ ఆద్యంతం విజ్ఞానదాయకంగా సాగింది. కోర్స్ డైరక్టర్ డాక్టర్ బెజవాడ పాపారావు, సెక్రటరీ డాక్టర్ వై. సాయి ప్రమోద్, వీవోఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం.జె. నాయుడు, సెక్రటరీ డాక్టర్ కె. వాసు, వోఎస్‌ఎస్‌ఏపీ ప్రెసిడెంట్ డాక్టర్ నారాయణరావు, సెక్రటరీ డాక్టర్ పి. నరేష్ బాబు తదితర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్ షాపును ప్రారంభించారు. ప్రైజ్ సెషన్స్ తో పాటు పలు అంశాలపై నిపుణులు వీడియో ప్రజంటేషన్ చేశారు. ఈ సీఎంఈకి సిరోనిక్స్ స్పాన్సర్‌గా వ్యవహరించగా, దేశంలోని వివిధ వైద్య విజ్ఞాన సంస్థల్లో సేవలందిస్తున్న దిగ్గజ వైద్య నిపుణులు ఈ వర్క్ షాప్ లో పాల్గొని, పలు అంశాలపై ప్రసంగించారు.