Nov 04,2023 22:44

ప్రజాశక్తి-హనుమాన్‌జంక్షన్‌ : చదువుతో పాటు ఆటల్లో కూడా ఆసక్తితో పాల్గొని కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించివచ్చని హెచ్‌ఎం దుర్గా ప్రసాద్‌ విద్యార్థులకు సూచించారు. అరుగొలను హైస్కూల్కు చెందిన విద్యార్థి జి.వికాస్‌ కష్ణాజిల్లా కబడ్డీ జట్టుకు ఎంపికవడం పట్ల హెచ్‌ఎం టి. దుర్గాప్రసాద్‌ శనివారం విద్యార్థి వికాస్‌ ను అభినందించారు. ఎస్జీఎఫ్‌(స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌) అధ్వర్యంలో అక్టోబరు 30వతేదీన జరిగిన ఎంపిక పోటీల్లో వికాస్‌ అత్యుత్తమ ప్రతిబ óకనబరచి జిల్లా జట్టుకు ఎంపికయ్యాడని పీడీ జి. నాగ సుబ్బారావు వివరించారు. క్రీడాస్ఫూర్తిని మెరుగుపర చు కుంటూ మరిన్ని విజయాలు సాధించాలని అభిల షిస్తూ ఎంపికైన విద్యార్థితో పాటు కోచ్‌ నాగ సుబ్బారావును పలువురు గ్రామ ప్రముఖులు అభినందిం చారు.