
జీన్స్ రీసైకిల్ షోలో పాల్గొన్న యువతులు
ప్రజాశక్తి - ఎడ్యుకేషన్ : ఫ్యాషన్ విద్యలో విద్యార్థులకు ఫాబ్రిక్ డిజైనింగ్‌లో అపార అవకాశాలుంటాయాయని సమన కాలెజ్ అఫ్ డిజైన్ స్టడీస్ అధినేత్రి సమన ముసవి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం బెంజిసర్కిల్ సమన విద్యాసంస్తల ప్రాంగణంలో జీన్స్ రీసైకిల్ షో అమె సంస్థ డైరక్టర్ అల్తఫ్ హుస్సేన్‌తో కలిసి ప్రారంభించారు. ఫ్యాషన్ విద్యార్థినులు తము స్వతహాగా జీన్స్ వ్యర్థాలతో తయారు చేసిన దుస్తులను తొడుక్కుని ప్రదర్శిస్తూ రాంప్ వాక్ చేశారు. దీపావలి దీప ర్యాంప్ వాక్ కూడా నిర్వహించారు. కన్నులపండుగ సాగిన ఈ అధునాతన దుస్తుల నడక పలువుర్ని ఆకర్షించింది. ఈ సందర్బంగా ప్రతిభకనపర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.