Oct 16,2023 16:40

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : ప్రజలకు చేరువగా మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతోనే ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఎంపిపి గోము వెంకటలక్మి, జెడ్పిటీసీ వడుగుల జ్యోతి,సొసైటీ అద్యక్షులు సింగిరెడ్డి రామకృష్ణ తదితరులు అన్నారు, సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు నిర్వహించి రోగులకు వైద్య సేవలందించారు,ప్రజా ప్రతినిధులు అధికారులు రోగులకు కిట్లు పంపిణీ చేశారు. శిబిరానికి వచ్చిన రోగులకు బిపి,షుగర్ వ్యాధి,కంటి వైద్యంతో బా టు వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు చేశారు, పౌష్టికాహార స్టాల్‌ ను వారు పరిశీలించారు. వివిధ రుగ్మతులతో బాధపడుతున్న సుమారు 600 మంది రోగులకు వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు,ఈ కార్యక్రమంలో రాజవొమ్మంగి సర్పంచ్‌ గొల్లపూడి రమణి, సర్పంచుల సమైక్య మండల అధ్యక్షులు కొంగర మురళీకృష్ణ,ఎంపిటిసి కనిగిరి గంగాదుర్గ, చప్పా చంద్రరాణి,ఎంపిడిఓ ఎల్ యాదిగిరేశ్వరావు, పంచాయతీ కార్యదర్శి ఏ మల్లేశ్వరరావు, ఐసిడిఎస్ సిడిపిఓ దేవామణి, సూపర్వైజర్ అరుణలత, వైద్య సిబ్బంది అంగన్వాడి ఆశ వర్కర్లు,వైసిపి నాయకులు,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.