
ఎంపికైన విద్యార్థులు
ప్రజాశక్తి - జగ్గయ్యపేట : బివి.సాగర్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో క్రికెట్ శిక్షణ పొందిన క్రీడాకారులు అండర్ 16 సెంట్రల్ జోన్ జట్టుకు ఎంపికయ్యారు. వీరిలో అమ్మాని కాలేజ్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఆల్ రౌండర్ రాజేష్, వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ శ్రీ నాగార్జున హై స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఇరువురు ఉన్నారు. నవంబర్ 1 నుండి 10 వరకు నెల్లూరులో జరిగే ఇంటర్ జోనల్ లెవల్‌లో నార్త్ జోన్, సౌత్ జోన్ జట్లతో తలపడతారు.