హోరా హోరీగా - ఆలిండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ - సింగిల్స్,మిక్స్‌డ్ డబుల్స్‌లో పోటీలు

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : యోనెక్స్ సన్‌రైజ్ ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీలలో మెయిన్ డ్రా పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఆదివారం నగరంలోని మూడు చోట్ల దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం, పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం, సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమిలో పోటీలు నువ్వా నేనా అన్నట్లు జరుగుతున్నాయి. పోటీలు అండర్ -15, అండర్ -17 బాల బాలికల విభాగంలో జరుగుతున్నాయి. ఈసదర్భంగా తొలి రౌండ్ విజేతల వివరాలను నిర్వాహకులు తెలియచేశారు.
అండర్ -15 .. సింగిల్స్ బాలుర విభాగంలో ప్రతీక్ కౌండిల్య (కర్ణాటక) 21-8, 21-12 పాయింట్లతో ఆయుష్ ఆదే (మహారాష్ట్ర)పై, తనీష్ చోక్షి (గురజాత్) 21-15, 21-15 పాయింట్లతో కవయుగన్ (తమిళనాడు)పై, మార్టిన్ ఇంగుడమ్ (మణిపూర్) 21-10, 21-12 పాయింట్లతో మంకుతాకుపై, విజయం సాధించారు. అవధూత్ కదమ్ ( మహారాష్ట్ర ) 21-10, 21-14 పాయింట్లతో కందర్ప్ శర్మ (రాజస్తాన్)పై, కిరణ్ నాగుంచి (కేరళ) 21-18, 17-21, 21-16 పాయింట్లతో ఆదవ్ స్యూ (తమిళనాడు)పై విజయం సాధించారు. బాలికల సింగిల్స్‌లో ఎస్.ఆర్. దిశా (తమిళనాడు) 21-12, 23-21 పాయింట్లతో బాల మన్వితారెడ్డి అల్లం (తెలంగాణ)పై, మోహిత పోలవరం (తమిళనాడు) 21-19, 19-21, 21-17 పాయింట్లతో ఐక్య శెట్టి (కర్ణాటక)పై, రిషిక నంది (డిల్లీ) 21-4, 21-6 పాయింట్లతో ప్రజక్త గౌక్వాడ్ (మహారాష్ట్ర)పై విజయం సాధించారు. స్నేహ మౌర్య (డిల్లీ) 21-17, 21-13 పాయింట్లతో ధాన్య సంజన పై విజయం సాధించారు. మిక్స్‌డ్ డబుల్స్ : చరణ్ రామ్ తిప్పన - జస్విత దంగటిల జోడి 21-6, 21-11 పాయింట్లతో శరత్ పండిట్ - రితిక కుంబ్లేపై విజయం సాధించారు. బేతన్ రౌత్ (ఒరిస్సా) శ్రేయ త్రిపాఠి (డిల్లీ) జోడి 21-7, 21-12 పాయింట్లతో శ్రీయాన్ష్ క్రేజివాల్, జెస్సికా శేషుపై విజయం సాధించారు. మిక్స్‌డ్ డబుల్స్ : అండర్ -17 విభాగంలో శౌర్య కిరణ్ - కీర్తి మంచల (తెలంగాణ) 21-5, 21-10వన్ష్ బత్ర - సీజా (పంజాబ్)పై, విష్ణు కేదార్ కోడే - ఎస్.కౌర్ లజోడి 21-15, 21-16 పాయింట్లతో లక్ష్య ముగ్థల్ -మెహక్ పూనియాపై విజయం సాధించారు.