స్నేహం అక్షరాలతో
పేర్చే వాక్యం కాదు
ఆశల హరివిల్లు కాదు
కరెన్సీ కట్టల హంగు కాదు
స్నేహం ఒక చనువు
ధైర్యాన్ని నింపుతుంది
స్నేహం ఒక తనువు
ఇద్దరినీ ఏకం చేస్తుంది
స్నేహం ఒక తరువు
కల్పవృక్షమై నిలుస్తుంది
స్నేహం ఒక హక్కు
అనుకున్నది సాధిస్తుంది
స్నేహం ఒక మధువు
తీయని అనుభూతులనిస్తుంది
స్నేహం ఒక ఛాలెంజ్
కష్టంలో తోడుంటుంది
స్నేహం ఒక పద్మవ్యూహం
వెనుదిరిగే ప్రసక్తేలేదు
స్నేహానికి పొగడ్తల అవసరం లేదు
మర్యాదలతో పనిలేదు
రారా, పోరాలే పలకరింపులు
రావే, పోవేలే ఆదరింపులు
డాబు దర్పాలకు తావులేదు
నేలా కుర్చీ లెక్కకు రావు
కాల పరిమితి లేదు
కాల నిబంధన లేదు
మొహమాటం అడ్డురాదు
మోహానికి లొంగిపోదు
పరిచయస్తులంతా
స్నేహితులు కారు
స్నేహానికి ఏ పరిచయాలు
అక్కరలేదు
నిన్ను తిట్టాడని
స్నేహితుడు శత్రువు కాదు
స్నేహితులకు ఏ పరిచయాలు
అక్కర లేదు
నిన్ను తిట్టాడని
స్నేహితుడు శత్రువు కాదు
నిన్ను పొగిడాడని
అపరిచితుడు స్నేహితుడు కాదు
శుకపికముల రవళి కన్నా
మనుషుల మధ్య స్నేహం మిన్న
అధిక సంపన్నుడంటే
డబ్బున్నవాడు కాడు
అధిక సంపన్నుడంటే స్నేహితులున్నవాడు
ఈ సృష్టిలో..
స్నేహానికి లేదు పోటీ
స్నేహానికి స్నేహమేరా సాటి..
సిహెచ్. ప్రేరణ
8వ తరగతి
విజరు హైస్కూలు,
నిజమాబాద్, తెలంగాణ.