Nov 04,2023 22:44

ప్రజాశక్తి-అవనిగడ్డ : కంచికచర్లలో ఓ ఎస్‌ సి యు కోడ్‌ పై వైకాపా రౌడీ మొకలు దాడి నీచమైన చర్య అని దాడిని ఖండిస్తూ టిడిపి ఆధ్వర్యంలో రాజీవ్‌ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఆ యువకుడ్ని కారులో ఎక్కించుకొని గంటల తరబడి తిప్పుతూ కొడుతూ తిడుతూ మంచి నీళ్లు అడిగితే మూత్రం పోయడం పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంత జరిగిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కేసును రాజీ ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి దళితులపై దాడులు ఎక్కువైపోతున్నాయని, ప్రతిరోజు ఎక్కడో ఒకచోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, నిందితులను మంత్రి ఆదిమూలపు సురేష్‌ రక్షించడం నీచమైన చర్య అన్నారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు మాచవరం ఆదినారాయణ, సర్పంచ్‌ మండలి ఉదయభాస్కర్‌, పార్టీ నాయకులు మేడికొండ విజరు ,బచ్చు రఘునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.