
ప్రజాశక్తి - ఎ.కొండూరు : ఎ.కొండూరు మండలంలో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు సాగు చేసిన వరి పత్తి పంటలు చేతికందే సమయంలో పూర్తిగా ఎండిపోయాయని దీంతో రైతులు పూర్తిస్థాయిలో తీవ్రంగా నష్టపోయారని అందువల్ల ప్రభుత్వం వెంటనే ఎ.కొండూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఎం సెక్రటేరియట్ సభ్యులు పివి.ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం రక్షణ భేరి ప్రచార యాత్ర మండలంలోని మాధవరం గ్రామంలో పర్యటించింది. ఈ సందర్భంగా ఆయన మాధవరం గ్రామ సమీపాన నీరు లేక పూర్తిగా ఎండిపోయి పశువులు మేస్తున్న వరి పొలాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో అన్ని మండలాల్లో వర్షపావ పరిస్థితులు వల్ల పంటలు ఎండిపోయి కరువు పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం మాత్రం జిల్లాలో రెండు మండల లనే కరువు మండలలుగా ప్రకటించిందని ఆరోపించారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జిల్లాలో ఉన్న రైతులను మోసగించడమే అన్నారు. కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో రైతుల రుణాలను రద్దుచేసి కొత్త రుణాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు నాయకులు పాల్గొన్నారు.