
హైకోర్టు న్యాయమూర్తి శ్యాం సుందర్‌కు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న ఆలయ ఇఓ రామారావు
ప్రజాశక్తి - వన్‌టౌన్ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శ్యాం సుందర్ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఆలయానికి విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేదపండి తులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ కార్యనిర్వాహణాధికారి కె.ఎస్. రామరావు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు.