Nov 03,2023 22:53

ప్రజాశక్తి-గన్నవరం : విద్యార్థులలో శాస్త్రీయ దక్పధం, సజనాత్మక పెరగడానికి చెకుముకి సైన్స్‌ సంబరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ముస్తాబాద్‌ జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ ప్రధాన ఉపాధ్యాయులు ఎం .వి. సుబ్బారావు తెలిపారు. చెకుముకి సైన్స్‌ సంబరాలు 2023 గోడ పత్రికను శుక్రవారం జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ నందు ఆయన ఆవిష్కరించారు. జన విజ్ఞాన వేదిక ప్రతినిధి షేక్‌ ఇమామ్‌ మాట్లాడుతూ చెకుముకి సైన్స్‌ సంబరాలు 4 దశలలో ఉంటాయని, మొదటి దశ నవంబర్‌ 10వ తేదీ పాఠశాల స్థాయిలో ఉంటుందని, రెండవ దశ మండల స్థాయిలో నవంబర్‌ 30వ తేదీన గన్నవరంలో జరుగుతుందన్నారు. మూడవ దశ జిల్లా స్థాయిలో డిసెంబర్‌ 17వ తేదీన మరియు చివరి దశ రాష్ట్రస్థాయిలో 2024 జనవరి 27 మరియు 28 తేదీలలో జరుగుతాయని వివరించారు. ఈ సైన్స్‌ సంబరాల్లో పాల్గొనటానికి ప్రతి పాఠశాలలో 8 9 మరియు 10వ తరగతి చదివే విద్యార్థులు అర్హులని తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమంలో ఈ సంబరాలు నిర్వహిస్తామని తెలియజేశారు. పాఠశాల స్థాయిలో 8 9 మరియు 10 తరగతి విద్యార్థులలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులు పాఠశాల జట్టుగా మండల స్థాయిలోకి ప్రవేశిస్తారని తెలియజేశారు. మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల నుంచి రెండు టీంలు అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల నుండి రెండు టీములను ఎంపిక చేసి జిల్లాకు పంపిస్తామని తెలియజేశారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానం పొందిన ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల జట్లను రాష్ట్రస్థాయికి పంపిస్తారని తెలిపారు. ఇతర వివరముల కొరకు 7799985786 సంప్రదించగలరు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ ఉపాధ్యాయులు విజయలక్ష్మి,, గీత భారతి, లక్ష్మణరావు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు