బియ్యం బదులు రాగులు పంపిణీ : జెసి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
జిల్లాలోని 5,41,678 రేషన్ కార్డుదారులకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా డిసెంబర్ నెలలో బియ్యం, రాగులు, గోదుమ పిండి, చక్కెర, కందిపప్పు మొదలగు సరుకులు పంపిణీ చేయబడునని బియ్యం, బదులుగా రాగులు 1కేజీ నుండి 3కేజీల వరకు ఉచితంగా ఇవ్వబడునని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్డుదారులు 1 కేజీ నుండి 3 కేజీలు వరకు బియ్యం బదులుగా రాగులు పొందవలసినదిగా అందరూ ఎండియు ఆపరేటర్లు బియ్యంతో పాటు రాగులు ఒక కేజీ కార్తుదారులకు వారి అభీష్టం మేరకు రాగులు సెప్టెంబర్ నెలకు 232 ఎంటిఎస్ అక్టోబర్ నెలకు 177 ఎంటిఎస్ నవంబర్ నెలకు 130 కార్డుదారులకు పంపిణీ చేయడం జరగుతుందన్నారు. ప్రతి కార్డుదారుడు డిసెంబర్ నెలకు బియ్యంతో పాటు రాగులు ఒక కేజీ ఉచితంగా, కందిపపు కేజి రూ.67లకు, చక్కెర పిహెచ్హెచ్ (తెల్లకార్డుకు కేజీ రూ.17లకు, ఏఏవై కార్డుకు 1కేజీ రూ.13.50లకు, గోదుమపిండి కేజీ ప్యాకెటు రూ.16లు నగదు చెల్లించి పొందాలని, ఈ అవకాశాన్ని అందరూ కార్డుదారులు వినియోగించుకోవాలని తెలిపారు.