Nov 04,2023 22:36

శిబిరం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వెలంపల్లి, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి


ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి టీడీపీకి అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ఘాటుగా విమర్శించారు. శనివారం పశ్చిమ నియోజకవర్గంలోని 35, 48, 52, 56 డివిజన్లలోని నాలుగు సచివాలయాల పరిధిలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను వెలంపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చెయ్యవలసిన పనుల గురించి పురందేశ్వరి మాట్లాడాలన్నారు. జగనన్న పాలనలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ రాయన బాగ్యలక్ష్మి, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.