
ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : మండల కేంద్రంలో మినీ ట్యాంకులు నిరుపయోగంగా పడిఉన్నాయి. పంచాయితీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆదివారం అక్కడి కాలనీవాసులు మాట్లాడుతూ ... ఆత్మకూరు గ్రామంలో సంగాబాయి పోతప్ప కట్ట వద్ద అంకాలమ్మ టెంపుల్ వద్ద మిని ట్యాంకులు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. వాటికి మరమ్మతులు చేసి నీళ్లు వదిలితే తమకు ఉపయోగపడతాయని చెప్పారు. ఇప్పటికైనా పంచాయితీ అధికారులు స్పందించి మినీ ట్యాంకర్ ను బాగు చేయించి నీళ్లు వదిలే ఏర్పాట్లు చేయాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.