Oct 17,2023 12:38

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని వైస్‌ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు, వైసిపి రాష్ట్ర నాయకులు దూలం వెంకన్నబాబు అన్నారు. మంగళవారం గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని వారు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ... జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలన్నారు. శిబిరంలో ప్రత్యేక వైద్య నిపుణులు 200 మందికి వైద్యసేవలు అందించారు. 100 మందికి కంటి పరీక్షలు చేశారు.హొ రోగులకు అవసరమైన పలు రకాల వైద్య పరీక్షలతో పాటు బ్రాండెడ్‌ మందులను శిబిరం వద్ద అందుబాటులో ఉంచారు. రోగి సమస్యను అనుసరించి వైద్యులు అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. పౌష్టికాహార కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ మెంబర్‌ చిలుకూరి బుజ్జి, సొసైటీ చైర్మన్‌ రామిశెట్టి శ్రీహరిబాబు, మండల అభివృద్ధి అధికారి ఐదం రాజు, తహశీల్దార్‌ టి ఆర్‌ రాజేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి నాయుడు రామచంద్రరావు, వైసిపి నాయకులు వల్లూరి రామకృష్ణ, పలివెల సుధాకర్‌, బూరిగ జానీ, పంచాయతీ కార్యదర్శి యు.వీర్రాజు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు.