ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : 2023 సంవత్సరానికి పీలేరు వాసవి క్లబ్ గ్రేటర్, వాసవి కపుల్స్ క్లబ్ లకు 13 వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సేవా పురస్కారాలు అందాయని వాసవి క్లబ్ గ్రేటర్ అధ్యక్షులు జూటూరు అరవింద్ తెలిపారు. ఆదివారం మదనపల్లి శ్రీరామ తులసి కళ్యాణ మండపంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి-211ఏ గవర్నర్ హనీషా డిస్కాన్ చేతుల మీదుగా పురస్కారాల ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం పీలేరులో అరవింద్ మాట్లాడుతూ ... తమ క్లబ్బులకు ఉత్తమ క్లబ్, ఉత్తమ అధ్యక్షుడు, ఉత్తమ డ్రెస్ కోడ్, సూపర్ ఎక్సెలెన్సీ, ఉత్తమ బ్యానర్ ప్రజెంటేషన్ అవార్డులు అందుకున్నట్లు చెప్పారు.
2023 సంవత్సరంలో 130 సేవా కార్యక్రమాలు నిర్వహించి వాటి కోసం రూ. 25 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. తమ క్లబ్బుల ద్వారా ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ రోజున భక్తులకు మెగా అన్నదాన కార్యక్రమం నిర్వహించామని, పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి పరిధిలోని 20 మంది క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకుని రూ.78 వేలు ఖర్చుతో వారికి 6 నెలలపాటు పౌష్టిక ఆహారాన్ని అందించామని, ఆర్యవైశ్యుల్లో నిరుపేదైన ఉస్తికాయలపెంట వాసి రాచపల్లి శంకర్ కు రూ.26,400 ఖర్చుతో ఆరు నెలల పాటు నిత్యావసర సరుకులు అందజేశామని అన్నారు. అలాగే పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో రూ.3 లక్షలు వ్యయం చేసి విద్యా గణపతి, వాగ్దేవిల దేవస్థానం ఏర్పాటు చేశామని చెప్పారు. ఆలంబన కార్యక్రమంలో భాగంగా పీలేరులోని శ్రీ లక్ష్మీ వఅద్ధాశ్రమంలో 5 మంది వఅద్ధులకు నెలకు రూ.200లు చొప్పున 12 నెలల పాటు ఆర్థిక సాయం అందించామని తెలిపారు. పీలేరు పట్టణానికి నాలుగు వైపులా ఉన్న రహదారుల ప్రక్కన స్వాగత బోర్డులు ఏర్పాటు చేశామని, స్థానిక క్రాస్ రోడ్డులోని బస్ స్టాప్ లో ప్రయాణీకుల కోసం, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో రోగులు కూర్చోడానికి వీలుగా రెండేసి సిమెంట్ బల్లలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. డాన్ టు డెస్క్ కార్యక్రమంలో విసిఐ ఇచ్చిన ఆరు కార్యక్రమాలే కాకుండా అదనంగా 10 సేవా కార్యక్రమాలు చేసి విసిఐ నుంచి క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి ముగ్గురూ బంగారు పతకాలను బహుమతిగా స్వీకరించడం జరిగిందన్నారు. అలాగే కెసి గుప్త జయంతి సందర్భంగా విసిఐ ఇచ్చిన 7 రకాల టాస్కులు నిర్వహించామన్నారు. అదేవిధంగా స్థానిక చిత్తూరు రోడ్డులోని ప్రభుత్వ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులకు మోటివేషనల్ తరగతులు, డెంటల్, ఐ క్యాంపులు నిర్వహించి, విద్యార్థినులకు నోటు పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేయడంతో పాటు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి వాసవి క్లబ్స్ సభ్యులు, మాజీ అధ్యక్షులు అయితా రాములు, బాలాజీ, కఅష్ణమూర్తి, సురేష్, ఇస్సా నాగలక్ష్మి, జిల్లా గవర్నర్ మహీధర్, వి. వెంకటేష్, కార్యదర్శి ప్రభాకర్ రావు, కోశాధికారి శివప్రసాద్, పీలేరు వాసవి క్లబ్ గ్రేటర్ అధ్యక్షులు జె. అరవింద్, కార్యదర్శి శివఫణేష్, కోశాధికారి గోవర్ధన్, వాసవి కపుల్స్ క్లబ్ అధ్యక్షులు మహీదర, కార్యదర్శి సురేష్, ట్రెజరర్ శంకర్ నాథ్ సభ్యులు పాల్గొన్నారు.