Nov 13,2023 14:54

నాపేరు అనంత్‌. నేను వేసవి సెలవులలో మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాము. అక్కడి తిరునాళ్ళు చూసి ఫ్రెండ్స్‌తో గంట మర్రిచెట్టు కింద ఆడాము. అందరికీ నీరసం వచ్చింది. ఎవరికి వారు వెళ్ళిపోయారు. సాయంత్రం దాకా ఉన్నాను. పక్కన పొలాలు, దూరంగా ఒక రూపం కనబడింది. నాకు వెన్నులో వణుకు వచ్చింది. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి చూసా. దిష్టి బొమ్మ అది. హమ్మయ్య అనుకొని కొంచెం శ్వాస తీసుకొని వెనక్కి తిరిగి చూసా. మొత్తం కారు మబ్బుల ఆకసమయినట్టు అయింది. చెట్టుకింద ఎవ్వరో లాంతరు పట్టుకొన్న ఒక ఆకారం. నాగుండె ఆగినంత పని ఆయిపోయింది. పరుగోపరుగు ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటిలో అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు.
ఏంటి! ఇంత సేపేంటి ఆటలు.. అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు.
నీకోసం వెళ్ళిన మామయ్య రాలేదే అని అమ్మమ్మ అడిగింది.
నేను చూడలేదని సమాధానం నాది.
అపుడు మావయ్య వచ్చి, నన్ను చూసి ఆగకుండా పారిపోయావే అని అడిగాడు.
అప్పుడు విషయం అర్థమయ్యింది. నేను చూసింది మామయ్యనేనని. దయ్యాన్ని కాదని. అసలు దయ్యాలే లేవని.


నాగ సాయి అనంతరామ్‌
9వ తరగతి, కూచిపూడి, కృష్ణాజిల్లా.