బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. టాలీవుడ్‌కీ సుపరిచితమే 'వన్ నేనొక్కడినే' చిత్రంతో వెండితెరకు పరిచయమై, ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలుగుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దీనికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా కృతి తన కెరీర్‌లో ఎదురైన చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు.. ఆ వివరాలేంటో చూద్దాం..
కృతిసనన్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. మహేష్‌బాబు హీరోగా నటించిన 'వన్.. నేనొక్కడినే' తో వెండి తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి.. బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. వెండితెర ఎంట్రీ ముందు ఎన్నో పెద్ద కంపెనీల కమర్షియల్స్‌లో నటించారు కృతి. ఆ తర్వాత అటు హిందీలో జాకీ షరాఫ్ కొడుకు టైగర్ షరాఫ్ సరసన హీరోపంతి సినిమాతో తెరంగేట్రం చేశారు. బాలీవుడ్‌లో.. అక్షరుకుమార్, షారుక్‌ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాలతోపాటు పలు సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు.
తాజాగా సుకుమార్, విజరు దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో కృతి హీరోయిన్‌గా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలో అధికారిక సమాచారం రావాల్సి ఉంది. దాంతో పాటు పలు తెలుగు చిత్రాల్లోనూ అగ్ర హీరోలు ఆమె పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అయితే గతేడాది అక్షరుకుమార్ యాక్షన్ ఎంటర్‌ట్రైనర్ 'అక్షరు పాండే' లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం 'హౌస్‌ఫుల్ 5' లోనూ నటిస్తున్నారు. ఇక 'ఆదిపురుష్'లో సీత పాత్రపై ఈమెకు నటిగా మంచిపేరు తీసుకొస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
- చాలా బాధపడ్డాను..
తాజాగా 'ఆదిపురుష్' ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న కృతి సనన్ తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను సైతం తెలియజేశారు. 'తొలిసారి ఫోటోషూట్‌లో పాల్గొన్నప్పుడు నా కాళ్లు చేతులు వణికాయి. ఆరోజు ఇప్పటికీ గుర్తు ఉంది. ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోను' అని తెలియజేశారు. ''మిమీ' చిత్రంలో సరోగసీ మదర్‌గా నటించడానికి 15 కిలోలు బరువు పెరిగాను. మళ్లీ ఆ బరువు తగ్గేందుకు చాలా కష్టపడ్డాను' అని గుర్తు చేసుకున్నారు.
- ఎన్నో ఆటుపోట్లు..
'నటిగా ఈ స్థాయికి రావడానికి చాలామందిలాగే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. తొలిసారి ఫొటోషూట్ అనుభవం అయితే అసలు మర్చిపోలేను. తొలి ఫొటోషూట్ జరిగిన రోజు ఇప్పటికీ గుర్తే. ఆ రోజు ఎందుకో చాలా ఆందోళనగా ఉన్నాను. ఫొటోషూట్ చేసి ఇంటికి వచ్చి, బోరున ఏడ్చేశాను. నేను సరిగా చేయలేదేమో అనే ఫీలింగ్‌తోనే ఆ రోజు కన్నీళ్లు ఆగలేదు. కానీ తర్వాత నెమ్మదిగా అలవాటైపోయింది. ఒకటి మాత్రం చెబుతాను.. విజయాల కంటే కూడా పరాజయాలే మనకు ఎక్కువ నేర్పుతాయి. అందుకే తప్పుల నుంచి ఎక్కువ నేర్చుకుంటేనే జీవితంలో ముందుకు వెళ్లగలుగుతాం' అని చెప్పారు కృతి.
పేరు : కృతి సనన్
పుట్టిన తేదీ : జులై 27, 1990
పుట్టిన ప్రాంతం : న్యూ ఢిల్లీ
నివాస ప్రాంతం : ముంబై
చదువు : బీటెక్
హాబీస్ : మెడిటేషన్, కుక్కింగ్, క్రికెట్
తల్లిదండ్రులు : రాహుల్ సనన్, గీతా సనన్
తోబుట్టువులు : నుపుర్ సనన్